అంగన్వాడీల ద్వారానే మహిళలు, చిన్నారులకు ఆరోగ్య భరోసా

జెడ్పీ సీఈఓ శేషాద్రి వరంగల్ వాయిస్, దామెర: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శేషాద్రి అన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం ఆయన దామెర మండలంలోని లేదల్ల గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీలు మరియు బాలింతలకు అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న పూర్వ...