అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ (వరంగల్ వాయిస్ - దామెర): దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబాసాహెబ్ చిత్రపటానికి స్థానిక సర్పంచ్ దుబాసి నవీన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ...