WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:22 pm Digital Edition : Ravi Goli

అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం

సర్పంచ్ మీ బిల్లా యాదగిరి

(వేలేరు – వరంగల్ వాయిస్ ):హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ మరియు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు సర్పంచ్ మీ బిల్లా యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “అంబేద్కర్ గారు దళితులకు, బడుగు బలహీన వర్గాల వారందరికీ దైవంతో సమానం. ఆయన అందించిన రాజ్యాంగం వల్లే నేడు అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయి. మహనీయుడు చూపిన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. మండల ప్రజలందరికీ ఆయన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను సర్పంచ్ కట్ చేసి విద్యార్థులు, యువతకు పంపిణీ చేశారు. జై భీమ్ నినాదాలతో వేలేరు పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో వేలేరు ఉప సర్పంచ్ శ్రీకర్, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ యువజన సంఘాల నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.