అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు
జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్ వరంగల్ వాయిస్, గీసుగొండ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ముఠాపై గీసుగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మండల పరిధిలోని ఊకల్ గ్రామ శివారులో చట్టవిరుద్ధంగా మట్టిని తరలిస్తున్న ఒక జేసీబీతో పాటు రెండు ట్రాక్టర్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊకల్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై...