అతివేగం.. మృత్యువుకు మార్గం
సీఐ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వాహనదారులు, ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే రోడ్డు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జనగామ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన రోడ్డు భద్రతపై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది యువకులు అకాల మరణం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు, మత్తు...