అభివృద్ధిని ఓర్వలేకనే గ్రంథాలయంపై కాంగ్రెస్ నాయకుల కక్ష

వరికోల్ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి వరంగల్ వాయిస్, పరకాల: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు నూతన గ్రంథాలయ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని వరికోల్ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని, వరికోల్ గ్రామ అభివృద్ధి ప్రదాత, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన గ్రంథాలయాన్ని, కంప్యూటర్లను యువత కోసం ఏర్పాటు చేసినట్లు...