WarangalVoice
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:06 am Digital Edition : Ravi Goli

‘అమోఘం’ హోటల్‌ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ : సుబేదారిలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమోఘం’ హోటల్‌ను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాష్ కుమారుడు అఖిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ..  కస్టమర్లే దేవుళ్లని, వారి సంతృప్తియే పరమావధిగా పనిచేయాలన్నారు.  రవి, ఈశ్వర్, నరేష్, సుధాకర్, మణికంఠ సోమన్న, రంగన్న, గట్టు రవి,  వెంకటేశ్వర్లు, శివ, అఖిల్ పాల్గొన్నారు.