అలరించిన శ్రీహర్ష ద్విగుణిత అష్టావధానం

(హనుమకొండ - వరంగల్ వాయిస్): సాహితీ నగరి హనుమకొండలో పద్యకళా వైభవం వెల్లివిరిసింది. కాకతీయ పద్యకవితా వేదిక ఆధ్వర్యంలో తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష నిర్వహించిన 'ద్విగుణిత అష్టావధానం' సాహితీప్రియులను మంత్రముగ్ధులను చేసింది. గాంధీనగర్‌లోని కొండా యాదగిరి నివాసంలో వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ అవధాన కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఈ అవధానానికి పద్యవశంకరులు, సమస్యాపృచ్ఛక చక్రవర్తి కంది శంకరయ్య సంచాలకులుగా వ్యవహరించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడిపించారు. అష్టావధాని తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, న్యస్థాక్షరి, వర్ణన, ఆశువు, పురాణ పఠనం, అప్రస్తుత...