అలియాబాద్‌లో కుక్కల బెడదకు చెక్
సర్పంచ్ సనత్ కుమార్ పటేల్ చొరవ వరంగల్ వాయిస్, పరకాల: మండలంలోని అలియాబాద్ గ్రామంలో గత కొంతకాలంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కుక్కల బెడదకు సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ చెక్ పెట్టారు. గ్రామంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయన్న గ్రామస్తుల ఫిర్యాదుపై ఆయన తక్షణమే స్పందించారు. మంగళవారం ప్రత్యేకంగా కుక్కలను పట్టే సిబ్బందిని గ్రామానికి పిలిపించి, వీధుల్లో సంచరిస్తున్న కుక్కలను పట్టించారు. దీనితో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి...