ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : తెలంగాణ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రఘునాథపల్లి మండలంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు సమర్పించారు. జూన్ 2 నాటికి కొత్త పే రివిజన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని...