ఆకట్టుకున్న ‘ఇవా కిడ్స్ ఆర్ట్ ఎక్స్ పో’
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన "ఇవా కిడ్స్ ఆర్ట్ ఎక్స్ పో-2026" సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇవా స్కిల్ షేర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కళా ప్రదర్శనలో 6 నుండి 16 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న 40 మంది చిన్నారులు పాల్గొని తమ అద్భుత సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. బాల కళాకారులు స్వహస్తాలతో రూపొందించిన రంగురంగుల చిత్రాలు, పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి....