ఆగష్టులో తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తొలి దశ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరించరాదని, వారికి ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌గా వేల్పుల కుమారస్వామిని, రాంపెల్లి శ్రీనివాస చారిని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ.. 1969 నుండి 1972 వరకు జరిగిన ఉధృతమైన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారని,...