ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటా

దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ వరంగల్ వాయిస్, దామెర : "గ్రామ ప్రజల ఆపదలో ఎల్లప్పుడూ ముందుండి అండగా ఉంటాను" అని దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్ స్పష్టం చేశారు. దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద మహిళ లచ్చమ్మ నివాసం ఉంటున్న రేకుల ఇల్లు ఇటీవల వీచిన ఈదురు గాలుల కారణంగా పూర్తిగా దెబ్బతింది. రాబోయే వర్షాలకు ఇల్లు కురిసి లోపలికి నీరు వస్తుందని, ఉండటానికి నీడ లేదని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్...