ఇంటింటి ఓటర్ల సర్వేను పర్యవేక్షించిన తహసీల్దార్

వరంగల్ వాయిస్, దామెర : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండలంలో సాగుతున్న ఓటర్ల ఇంటింటి సర్వే విధుల్లో ఉన్న బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఐడీ కార్డు, క్యాప్, టీ-షర్ట్ ధరించి విధులను నిర్వర్తించాలని దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి ఆదేశించారు. మంగళవారం దామెర మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో కొనసాగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026'కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేస్తూ, ఓటర్ల నుండి వివరాలను సేకరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు....