WarangalVoice
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:00 am Digital Edition : Ravi Goli

ఇద్దరి సస్పెన్షన్..

బాధ్యులపై చర్యలు తీసుకున్న అధికారులు..
విద్యార్థుల అసాంఘీక చర్యలపై స్పందించిన యంత్రాంగం
దామెర సోషల్ వెల్ఫేర్ ఘటనపై వేటు..

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో విద్యార్థుల అసాంఘిక కార్యకలాపాలపై చెలరేగిన దుమారం ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ వరకు వెళ్లింది. పాఠశాలలో సుమారు 14 మంది విద్యార్థులు క్రమశిక్షణ ఉల్లంఘించారనే నేపథ్యంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిన విషయాన్ని వరంగల్ వాయిస్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కలకలం రేపిన ఈ ఘటన వెనక అసలు నిజాలను రాబట్టడానికి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించండంతో గుట్టు రట్టైంది. మొత్తం వ్యవహారంలో విద్యార్థులపై పర్యవేక్షణ ఉంచాల్సిన సంబంధిత ప్రిన్సిపాల్ సహా మరో ఉపాధ్యాయుడు బాధ్యులని తేలడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.