ఇరిగేషన్ శాఖకు కోర్టు షాక్

ఎల్ఎండి, పోచంపాడు కార్యాలయ ఆస్తుల జప్తుకు ఆదేశం అధికారుల నిర్లక్ష్యంపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం వరంగల్ వాయిస్, వరంగల్/హనుమకొండ : నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ శాఖకే తలవంపులు తెచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కెనాల్ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడమే కాకుండా, న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఆస్తులను జప్తు చేయాలని రంగారెడ్డి కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 'వెంకటేశ్వర ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్' అనే సంస్థ శ్రీరామ్...