ఈత సరదా.. విషాదం కావొద్దు

వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వేసవి కాలంలో యువత, విద్యార్థులు ఈత నేర్చుకునే క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనగాం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, కాలువలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని, ఈ క్రమంలో చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరించారు. ఈత రాని వారు ఒంటరిగా నీటి వనరుల వద్దకు వెళ్లకూడదు. తల్లిదండ్రులు లేదా అనుభవం ఉన్న పెద్దల సమక్షంలోనే...