WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 1:12 am Digital Edition : Ravi Goli

ఉన్నత విద్యతోనే మాదిగల ఆత్మగౌరవం

ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ

కోగిలివాయి గ్రామంలో ఘనంగా ‘గో టు విలేజ్’

వరంగల్ వాయిస్, దామెర : మాదిగ బిడ్డలు ఉన్నత చదువులు చదివి, సామాజికంగా ఎదిగినప్పుడే ఆత్మగౌరవం సిద్ధిస్తుందని మాదిగ సబ్-ప్లాన్ (ఎంఎస్పీ) రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిలివాయి గ్రామంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ మాదిగ సమన్వయకర్తగా, గ్రామ సర్పంచ్ చుక్క మహేందర్ మాదిగ అధ్యక్షతన ‘గో టు విలేజ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరెపల్లి పవన్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ ‘గో టు విలేజ్’ కార్యాచరణను చేపట్టామని తెలిపారు. “ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వేలో మాదిగ సామాజికవర్గ పిల్లలు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నట్లు (డ్రాప్ అవుట్స్) తేలింది. దీనిని అరికట్టేందుకు ప్రతి మాదిగ బిడ్డ కృషి చేయాలి. ఎంతో పోరాడి సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందాలంటే.. మన పిల్లలు ఉన్నత ఉద్యోగాలు సాధించాలి. అందుకు విద్యే ఏకైక మార్గం.” అని ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ అన్నారు. త్వరలోనే రానున్న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ జాతి అంతా ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి నాయకులు ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. ఈ మహాసభలో కోగిలివాయి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చుక్క రాజేందర్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఆకునూరి రవి మాదిగ, చుక్క సాంబయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా చుక్క మొగిలి మాదిగ, ప్రచార కార్యదర్శిగా మేకల ఎల్లయ్య మాదిగ, సహాయ కార్యదర్శిగా మేకల సమ్మయ్య మాదిగలు ఎన్నికయ్యారు. మహిళా విభాగం బలోపేతానికి గానూ మహిళా సమాఖ్య కమిటీని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అధ్యక్షురాలిగా మేకల దేవిక మాదిగ, ఉపాధ్యక్షురాలిగా చుక్క మమత మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మేకల రమ మాదిగ, ప్రచార కార్యదర్శిగా మేకల లక్ష్మీ మాదిగలు ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీల ఎన్నికల అనంతరం గ్రామస్థులు నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోగిలివాయి గ్రామానికి చెందిన మాదిగ మహిళలు, యువకులు, వృద్ధులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.