ఉన్నత విద్యతోనే మాదిగల ఆత్మగౌరవం
ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ కోగిలివాయి గ్రామంలో ఘనంగా 'గో టు విలేజ్' వరంగల్ వాయిస్, దామెర : మాదిగ బిడ్డలు ఉన్నత చదువులు చదివి, సామాజికంగా ఎదిగినప్పుడే ఆత్మగౌరవం సిద్ధిస్తుందని మాదిగ సబ్-ప్లాన్ (ఎంఎస్పీ) రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిలివాయి గ్రామంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ మాదిగ సమన్వయకర్తగా, గ్రామ సర్పంచ్ చుక్క మహేందర్ మాదిగ అధ్యక్షతన ‘గో టు విలేజ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...