WarangalVoice
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 4:05 pm Digital Edition : Ravi Goli

ఊకంటి మహేందర్‌కు జాతీయ స్థాయి పురస్కారం

వరంగల్‌లో ఘనంగా సత్కారం

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఉద్యోగ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీ ఊకంటి మహేందర్ కి జాతీయ స్థాయి పురస్కారం – 2026 లభించింది. జమ్మికుంట పోస్ట్‌మాస్టర్‌గా, అలాగే అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (గ్రూప్-సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల తపాలా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు సేవా ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడటంతో పాటు తపాలా శాఖ అభివృద్ధికి యు.మహేందర్ విశేష కృషి చేశారు. ఉద్యోగ సేవా రంగంలో ఆయన కనబరిచిన అంకితభావం, సహచర ఉద్యోగులకు అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని గుర్తించి ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు వరంగల్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం – తెలుగు వెలుగు సాహితీ వేదిక 2026 ప్రాంగణంలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ వేదికపై పలువురు ప్రముఖుల సమక్షంలో మహేందర్ ని సత్కరించి జాతీయ పురస్కారాన్ని అందజేశారు. “ఉద్యోగ సేవలో అంకితభావం – సమాజ సేవలో స్ఫూర్తి” అనే నినాదంతో లభించిన ఈ గౌరవం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు. తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ ప్రతినిధులు, సహచర ఉద్యోగులు, శ్రేయోభిలాషులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమానికి, తపాలా సేవల పురోగతికి ఆయన ఇలాగే సేవలు అందించాలని ఆకాంక్షించారు.