ఊరుగొండలో బాలిక అదృశ్యం
వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల పరిధిలోని ఊరుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాత్విక (13) అనే బాలిక శనివారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది. బాలిక తండ్రి సతీష్ కాగా, ఇంటి వద్ద ఉన్న బాలిక మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక తల్లి చాపర్తి కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఎత్తు 4 అడుగుల 2 అంగుళాలు, రూపం చామన...