ఎలుకుర్తి హవేలీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ముఖ్య అతిథిగా హాజరైన మార్త రమేష్ (గీసుగొండ - వరంగల్ వాయిస్): గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు చిరస్మరణీయంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహాన్ని నిమ్స్ అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని అందించిన ఏకైక మహనీయుడు అంబేద్కర్...