ఏక్తా దివస్ పరేడ్ లో హనుమకొండ జిల్లా బృందం
వరంగల్ వాయిస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా ప్రతినిధులు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ తొలి ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా ఏక్తానగర్లో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ వేడుకల్లో హనుమకొండ జిల్లాకు చెందిన ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా నుంచి కోడిమాల శ్రీనివాసరావు (పూర్వ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్), పబ్బు సతీష్ (కమలాపూర్ సర్పంచ్), ఉత్తమరాజు వికాస్ (సమాజ సేవకుడు), ఒంటెల నికితాంజలి (వ్యాపార రంగం),...