ఒత్తిడిని అధిగమించడమే నిజమైన మానసిక ఆరోగ్యం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు వరంగల్ వాయిస్, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు 'యోగ, మానసిక ఆరోగ్యం' అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెంటల్ హెల్త్ కన్వీనర్ వేముల రమేష్ ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్ వినయ్, డాక్టర్ నిఖిత ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు....