తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి
వరంగల్ వాయిస్, దామెర : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2026 లో భాగంగా బుధవారం దమెర మండల తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ, ఎలాంటి లోపాలు లేని, పూర్తి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలో బీఎల్ఓలు, బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. “క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.” అని తహసీల్ాదర్ జ్యోతి వరలక్ష్మి దేవి అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూడడం. ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా నింపే విధానంపై అవగాహన. అర్హత కలిగిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడం. మరణించిన వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను తొలగించడం మరియు డూప్లికేట్ ఓట్లను గుర్తించడం. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.