కందగట్ల గణేష్‌కు అంతర్జాతీయ పురస్కారం
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : ముప్పై ఏళ్లుగా ఆంగ్ల బోధనలో విశేష కృషి చేస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పనిచేస్తున్న జ్ఞాన ఉదయ్ ఫౌండేషన్ ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు’ను ప్రకటించింది. గురువారం వెల్దిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్ చేతుల మీదుగా గణేష్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా...