కన్నుల పండువగా జంజిరాల పున్నమి వేడుకలు
ఘనంగా జంజిర ధారణ, హోమ వేడుకలు మగ్గంతో కూడిన రథయాత్ర, భారీ బైక్ ర్యాలీతో హోరెత్తిన కమలాపూర్ సాంస్కృతిక శోభతో అట్టహాసంగా పద్మశాలీల సంబరాలు రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి కులస్తులకు అత్యంత విశేషమైన ‘జంజిరాల పున్నమి’ వేడుకలను హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి సంఘ భవనంలో మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య యజ్ఞోపవేతం, గాయత్రి మంత్ర పఠనంతో జంజిర ధారణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు....