WarangalVoice
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 2:31 pm Digital Edition : Ravi Goli

‘కరాటే పాట’ను విడుదల చేసిన హీరో సుమన్

మార్షల్ ఆర్ట్స్ కోచ్ గడదాసు మణికంఠ     

సరికొత్త ప్రయోగం

వరంగల్ వాయిస్, వరంగల్ : సినీ నటుడు, యాక్షన్ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రపంచంలోనే మొదటిసారిగా రూపొందించిన ‘కరాటే పాట’అంగరంగ వైభవంగా విడుదలైంది. వరంగల్ శివనగర్‌లోని కేపీఎస్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గడదాసు మణికంఠ నేతృత్వంలో రూపొందించిన ఈ సాంగ్‌ను హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ పూర్తి పాటను వీక్షించి, కరాటే నేపథ్యంలో సాంగ్ రూపకల్పన చేయడం చాలా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మార్షల్ ఆర్ట్స్‌పై యువతకు అవగాహన పెంచేందుకు ఈ పాట ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ దేశంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ట్రైనింగ్ క్యాంప్, మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పాల్గొనడానికి కోచ్ గడదాసు మణికంఠ వెళ్లనున్నారు. జూన్ 1న ఆయన జపాన్ బయలుదేరి వెళ్తున్న తరుణంలో.. అదే రోజు ఆయన పుట్టినరోజు కూడా కావడంతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జపాన్ టూర్‌తో పాటు పుట్టినరోజును పురస్కరించుకుని హీరో సుమన్, కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోచ్ మణికంఠకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, అభినందనలు మరియు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కరాటే అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.