కళ్లాల్లో రైతు కన్నీరు..

కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల ‘ధాన్యం’ గాథ వరంగల్ వాయిస్, దామెర : రుతువుల పొడవునా రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట, చేతికొచ్చే వేళ అన్నదాతను కన్నీటి పర్యంతం చేస్తోంది. పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి వారాలు గడుస్తున్నా.. అడుగు ముందుకు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. అకాల వర్షం ఎప్పుడు ముంచుకొస్తుందోనన్న భయం...