కాంగ్రెస్ లో బీసీలకు ఒక న్యాయం.. అగ్రకులాలకు ఇంకొక న్యాయమా..?
వరంగల్ వాయిస్, దామెర : రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై బీసీ నాయకుడు కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసరగొండ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ . బీసీల విషయంలో ఒక న్యాయం..అగ్రకులాల విషయంలో మరో న్యాయం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం పట్ల ఆయన మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖమ్మ కూతురు కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి...