కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకం..
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు వరంగల్ వాయిస్, వరంగల్ : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా తనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కట్టబెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె అభివర్ణించారు. బీసీల పక్షపాతి అయిన సీఎం రేవంత్ రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని సుధారాణి కొనియాడారు. బీసీ మహిళలకు...