WarangalVoice
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 10:07 am Digital Edition : Ravi Goli

కుమారస్వామి యాదవ్‌కు ‘శ్రమశక్తి’ అవార్డు

వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడే దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “శ్రమశక్తి” అవార్డును హనుమకొండ జిల్లాకు చెందిన ప్రముఖ కార్మిక నేత పంకెర్ల కుమారస్వామి యాదవ్ అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో శ్రమశక్తి అవార్డు సాధించిన కుమారస్వామి యాదవ్‌కు పలువురు కార్మిక నేతలు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.