WarangalVoice
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 2:35 pm Digital Edition : Ravi Goli

కోటంచలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేశవమూర్తి

 కేశవమూర్తికి ఆలయ చైర్మన్ సంపత్ రావు సన్మానం

వరంగల్ వాయిస్, రేగొండ : మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటంచ గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి వారిని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం కేశవమూర్తి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తిని ఎన్ఎస్ఆర్ గ్రూప్ అధినేత, కోటంచ ఆలయ చైర్మన్ సంపత్ రావు ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, స్వామి వారి శేషవస్త్రాన్ని బహూకరించి అభినందనలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి, హనుమకొండ జిల్లాలో యూనియన్ బలోపేతానికి కేశవమూర్తి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి, దామెర శ్రీకాంత్‌లతో పాటు ఆలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.