కోటంచలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేశవమూర్తి
కేశవమూర్తికి ఆలయ చైర్మన్ సంపత్ రావు సన్మానం వరంగల్ వాయిస్, రేగొండ : మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటంచ గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి వారిని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం కేశవమూర్తి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన టీయూడబ్ల్యూజే...