కోటగుళ్ళ గోమాతలకు దాన బస్తాల వితరణ

  వరంగల్ వాయిస్, గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చారిత్రక సంపద, కాకతీయుల కళాక్షేత్రమైన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం (కోటగుళ్ళు) గోశాలలోని గోమాతలకు శనివారం దాన బస్తాలను వితరణ చేశారు. పరకాలలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ పోతుగంటి శశిధర చారి, ప్రిన్సిపల్ పోతుగంటి స్వప్న చారి దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ రజతోత్సవ వివాహ వేడుకల సందర్భంగా ఈ దంపతులు ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక...