గిర్నిబావిలో కంకులతో ‘మొక్కజొన్న ఇల్లు’

వినూత్న ప్రదర్శనతో ఆకట్టుకున్న బాయర్ కంపెనీ ముఖ్య అతిథిగా హాజరైన నాగుర్ల వెంకటేశ్వర్లు వరంగల్ వాయిస్, గిర్నిబావి (నర్సంపేట) : వరంగల్ జిల్లా నర్సంపేట గిర్నిబావి గ్రామంలో బుధవారం నిర్వహించిన మొక్కజొన్న ప్రదర్శన క్షేత్ర సందర్శన కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బాయర్ కంపెనీ ప్రతినిధులు మొక్కజొన్న కంకులతో అద్భుతమైన ‘ఇంటి’ ఆకారాన్ని నిర్మించి, తమ విత్తన రకాల సామర్థ్యాన్ని డీలర్లు మరియు రైతులకు వినూత్నంగా ప్రదర్శించారు. మొక్కజొన్న కంకులతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు....