WarangalVoice
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:54 pm Digital Edition : Ravi Goli

గ్రామాభివృద్ధికి సహకరించండి

సర్పంచ్ దాడి వసంత రమేష్

వరంగల్ వాయిస్, దామెర: గ్రామా అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రిని తక్కలపాడు గ్రామ సర్పంచ్ దాడి వసంత కోరారు. బుధవారము దామెర మండల కేంద్రంలో జరిగిన మండల సమీక్ష సమావేశ అనంతరం మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సర్పంచ్ దాడి వసంత గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ దాడి రమేష్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధి పారిశుద్ధ్యం రహదారులు తదితర విషయాలపై వివరించి గ్రామానికి అదనపు నిధులను మంజూరు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.