గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులదే కీలక పాత్ర

ఎంపీడీఓ గుమ్మడి కల్పన వరంగల్ వాయిస్, దామెర : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు అత్యంత కీలక పాత్ర పోషించాలని దామెర మండల ప్రజా పరిషత్ అధికారి గుమ్మడి కల్పన పిలుపునిచ్చారు. మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంతో పాటు ఊరుగొండ గ్రామంలోని రైతు వేదికలలో మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన మాట్లాడుతూ.. స్థానిక పరిపాలనలో వార్డు సభ్యుల పాత్రను విస్మరించలేమని అన్నారు....