WarangalVoice
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:55 pm Digital Edition : Ravi Goli

గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి

వరంగల్ వాయిస్,దామెర: గ్రామాలను సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి అన్నారు బుధవారము దామెర మండలంలోని సమావేశ మందిరంలో మండల సమావేశం మండల ప్రత్యేక అధికారి లక్ష్మీప్రసన్న అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల పెంపుదలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని రైతుల పొలాలలో ఏర్పాటు చేసుకునే ఫామ్ ఫండ్స్ ఇంకుడు గుంతలు బోర్వెల్ రీఛార్జ్ తదితర వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా సర్పంచులు అధికారులు సమన్వయంతో ప్రజలకు అందించాలని అన్నారు గ్రామాలలో ముఖ్యంగా పరిశుభ్రత  విద్య వైద్యం తదితర అంశాలపై సర్పంచులు అధికారులు దృష్టిని సారించాలని అన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఇటీవలనే ప్రమోషన్ పొంది మొదటిసారి దామెర మండల ప్రజా పరిషత్ కు వచ్చిన సందర్భంగా ఎంపీడీవో, ఎమ్మార్వో, కల్చర అధికారులు గ్రామాల సర్పంచులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు దుబాసి నవీన్ వివిధ గ్రామాల సర్పంచులు శ్రీధర్ రెడ్డి, బొంకూరి రవి యాదవ్, కొట్టే వాని, దాడి వసంత, శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.