WarangalVoice
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 3:22 pm Digital Edition : Ravi Goli

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి

వరంగల్ వాయిస్, దామెర : గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి అన్నారు. దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక దారి సమస్యను ఆయన సోమవారం పరిష్కరించారు. స్మశాన వాటికకు సరైన దారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్ రెడ్డి, సంబంధిత వెంచర్ యాజమానితో సంప్రదింపులు జరిపారు. 30 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి వెంచర్ యజమానిని ఒప్పించగా, ఆయన సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు. గతంలో ఈ రోడ్డు కోసం గ్రామస్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల చొరవతో సమస్య కొలిక్కి రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మన్నెం ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. ఓగ్లాపూర్ గ్రామంలో స్మశాన వాటిక దారితో పాటు మిగతా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ (వార్డు సభ్యులు) కిన్నెర కోటేశ్వర్, వార్డు సభ్యులు తుమ్మనపెల్లి కుసుమాబాయి రామేశ్వరరావు, కనుకుంట్ల రజిత నరేష్ పాల్గొన్నారు. అలాగే ఏఎంసి డైరెక్టర్ దామెర శంకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాసమల్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి నల్ల రాజు, యూత్ అధ్యక్షుడు ఫర్హాన్, సీనియర్ నాయకులు దామెర చేరాలు, వడ్డెపల్లి రవి, పొలు భద్రయ్య, కూతాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.