గ్రామీణ తపాల ఉద్యోగులను 8వ పే కమిషన్‌లో చేర్చాలి

ఏఐజీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రామీణ తపాల ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వారిని తక్షణమే 8వ పే కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని అఖిలభారత గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. గ్రామీణ తపాల ఉద్యోగులకు 8వ వేతన సంఘం ప్రయోజనాలను...