‘గ్రీన్ మ్యాట్’ కింద సర్పంచ్ విధులు

శిథిలావస్థకు చేరిన గంటూరుపల్లి గ్రామ పంచాయతీ భవనం స్లాబ్ పెచ్చులు ఊడుతున్నా పట్టించుకోని అధికారులు కొత్త భవనం మంజూరు చేయాలి సర్పంచ్ చల్లా రాకేష్ రెడ్డి డిమాండ్ వరంగల్ వాయిస్, హసన్‌పర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పాత భవనాల్లో ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. హసన్‌పర్తి మండలంలోని గంటూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని...