ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
విద్యార్థులకు ఫీజులు, వ్యాపారులకు గొడుగుల అందజేత వరంగల్ వాయిస్, హనుమకొండ: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా హనుమకొండలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 52వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తల పిల్లల పాఠశాల ఫీజుల నిమిత్తం రంజిత్ రెడ్డి చెక్కులను అందజేశారు. 29వ డివిజన్...