WarangalVoice
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 6:01 am Digital Edition : Ravi Goli

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు 5వ డివిజన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 5వ డివిజన్ ఇన్చార్జి సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలను, సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పండుగ సాగర్, అరవింద్, క్రాంతి, సమ్మన్న, నారాయణగిరి రాజు, విశాల్, రాజశేఖర్, తాడిశెట్టి రాము, సాయి, మూల ప్రభాకర్, రవి ప్రభాకర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో డివిజన్ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.