WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 2:27 pm Digital Edition : Ravi Goli

ఘనంగా మేడిశెట్టి రాములు జన్మదిన వేడుకలు

వరంగల్ వాయిస్, పర్వతగిరి : పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా తెప్పించిన 4 కిలోల భారీ కేక్‌ను మేడిశెట్టి రాములు కట్ చేయగా, కార్యకర్తల కరతాళ ధ్వనులతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. అనంతరం నాయకులు, అభిమానులు శాలువాలతో మేడిశెట్టి రాములును ఘనంగా సన్మానించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు జీవితాంతం ఇలాగే గుర్తుండిపోతాయని, తన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, సర్పంచులు, వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మేడిశెట్టి రాములుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.