శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ ప్రముఖులు
వరంగల్ వాయిస్, హనుమకొండ : బీజేపీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు తనయుడు డాక్టర్ వన్నాల వెంకట రమణ-డాక్టర్ వన్నాల పావన దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలు శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు విచ్చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఆన్‌లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, ‘ఢీంబాయ్ టీవీ’ న్యూస్ ఛానల్ సీఈవో వేముల సదానందం నేత, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట రమణ, పావన దంపతులను వారు ఘనంగా పట్టు శాలువాతో సత్కరించారు. దంపతులు దైవాశీస్సులతో నూరేళ్లు ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సుఖసంతోషాలతో వర్ధిల్ల్లాలని ఈ సందర్భంగా వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.