WarangalVoice
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 2:31 pm Digital Edition : Keshavamurthy Gaddam

ఘనంగా హనుమాన్ మాల స్వాములకు భిక్షా కార్యక్రమం

  • కాళేశ్వరంలో వీర హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ మాల స్వాములకు భిక్షా కార్యక్రమం..

వరంగల్ వాయిస్ ( మహాదేవపూర్, మార్చి 24 ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పవిత్ర క్షేత్రమైన కాళేశ్వరంలో ఉన్న వీర హనుమాన్ ఆలయంలో గ్రామానికి చెందిన ఆరుట్ల శ్రీ విష్ణువీణ – భాస్కర చార్యులు దంపతుల ఆధ్వర్యంలో భక్తి, సేవా భావంతో హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములకు భిక్షా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలయం అర్చకులు మాడుగుల బాపు శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది హనుమాన్ మాల స్వాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. భజనలు, హనుమాన్ నామస్మరణల మధ్య భక్తి వాతావరణం నెలకొంది. స్వాములు శ్రద్ధాభక్తులతో భిక్షను స్వీకరించి ప్రసాదం తీసుకున్నారు. కార్యక్రమం నిర్వహణలో గ్రామస్థులు, యువకులు సేవా భావంతో సహకరించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తిని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఆరుట్ల శ్రీ విష్ణువీణ – భాస్కర చార్యులు దంపతులను, అలాగే సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ భక్తులు అభినందించారు.

hanuman_deeksha