ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

వరంగల్ వాయిస్, దామెర: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా దామెర మండల కేంద్రంలో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి గురిజాల శ్రీరామ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని...