ఘోర రోడ్డు ప్రమాదం
టిప్పర్‌ను ఢీకొట్టిన లారీ, డ్రైవర్ మృతి అకస్మాత్తుగా రహదారి మధ్యలో ఆగిన టిప్పర్ అదుపుతప్పి ఢీకొట్టిన లారీ చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ కన్నుమూత వరంగల్ వాయిస్, దామెర : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దామెర క్రాస్ రోడ్డు సమీపంలోని డిస్నీలాండ్ స్కూల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వొలిగొండ మండలం గొల్లపెల్లి గ్రామానికి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26)...