WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 1:23 pm Digital Edition : Ravi Goli

చంద్రయ్య మృతిపై సర్పంచుల ఫోరం నివాళి

వరంగల్ వాయిస్, వేలేరు : మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తూముల చంద్రయ్య (గొల్ల కృష్ణం పల్లె సర్పంచ్ బత్తుల శ్రీనివాస్ మామ) చిత్రపటానికి పూలమాలలు వేసి వేలేరు మండల సర్పంచుల ఫోరం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం పిచర గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఇతర సర్పంచులు చంద్రయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో సర్పంచులు అశోక్, మౌనిక సంపత్, మనోజ్, రాజు, సాంబయ్య, అరుణ నాగరాజు, పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.